బహుజన రాజ్యంలో ఆరోగ్యానికి పెద్దపీట

బహుజన రాజ్యంలో ఆరోగ్యానికి పెద్దపీట

డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మునుగోడు, అక్షిత ప్రతినిధి :

ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు లొ ఓటు అవగాహన చైతన్యం కొరకు “మన ఓటు- మన భవిష్యత్తు ” అనే నినాదంతో ఈరోజు ఉదయం 5K రన్ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ వర్షిత్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది నాగం హాస్పిటల్ నల్గొండ, మరో అతిథి ట్రస్టెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ.రాజారావు, జనరల్ సెక్రెటరీ బి.సురేంద్ర కుమార్, బొజ్జ సైదులు  జండా ఊపి రన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు స్వామి మాట్లాడుతూ ఓటును డబ్బుకు మద్యానికి అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేసి నిజాయితీ గల వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా సూచించారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కొప్పోలు రవివర్మ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఫిట్ ఇండియా ఫౌండేషన్ యొక్క అజెండా ఆరోగ్య భారత్ నిర్మాణం గురించి తెలియజేశారు. వర్షిత్ రెడ్డి  మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ బీరు బిర్యానీ లకు అమ్ముడుపోకుండా నిజాయితీ గల వ్యక్తిని ఎన్నుకోమని సూచించారు. రాజారావు  మాట్లాడుతూ ఫిట్ ఇండియా ఫౌండేషన్ వారు చెప్పిన నియమాలు పాటిస్తే కచ్చితంగా వంద సంవత్సరాలు బ్రతకొచ్చని తెలియజేశారు ఈ రన్ లో పాల్గొని విజేతలుగా నిలిచిన 1st, 2nd, 3rd. స్త్రీ, పురుష అభ్యర్థులను సత్కరించి ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు బి.వెంకటేష్, ఈ. కృష్ణ, ఆంగోత్ సేవ్ల నాయక్, రాజు, లింగస్వామి, బెన్ని రాజు, పవన్,మల్లేష్, ట్రాన్స్కో రూరల్ జోన్ ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ చింత ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking