కమలాన్ని వీడి… గులాబీ గూటికి

బిజెపి మండల అధ్యక్షుడు
టిఆర్ఎస్ లో చేరిక

పలివెల సర్పంచ్ గజ్జల బాలరాజు గౌడ్

మునుగోడు ,అక్షిత ప్రతినిధి:

బిజెపి మండల అధ్యక్షుడు పలివెల గ్రామ సర్పంచ్ గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన మునుగోడు మండల పార్టీ అధ్యక్షుడు గజ్జల బాలరాజ్ గౌడ్. బిజెపికి గుడ్ బై చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల సమక్షంలో టీ. ఆర్. ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. అధ్యక్షుడి బాటలో బిజెపిని వీడి టీఆర్ఎస్ లో చేరిన మండల బిజెపి కార్యదర్శులు జానయ్య, నర్సింహలు పార్టీ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరినారు. వీరికి గులాబి కండువాలు కప్పి
పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking