రాజకీయ ప్రకటనల పరిశీలనకై… ఎంసీఎంసీ

*జిల్లా కేంద్రంలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వివిధ పత్రికలలో, టి.వి. ఛానల్, కేబూల్ నెట్వర్క్ లలో, సినిమా టాకిసులలో మరియు సోషల్ మీడియాలో వచ్చే వివిధ రాజకీయ ప్రకటనలను ఏప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మరియు మీడియా మానిటరింగ్ (MCMC) కమిటి పనిచేస్తున్నటుగా జిల్లా కలెక్టర్  వినయ్ కృష్ణా రెడ్డి తెలియజేశారు. కావున ఎలాంటి ఎన్నికల ప్రకటనలు టెలివిజన్ లలో,కేబుల్ ఛానళ్లలో, సినిమా థియేటర్ లలో,సోషల్ మీడియాలో ప్రకటనలనైన ప్రదర్శించడానికి ఈ ఎం.సి.ఎం.సి కమిటీ నుంచి అభ్యర్థులు తప్పక అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా ప్రకటనలు జారీ చేసినట్లయితే, అట్టి అభ్యర్థులపై తగు చర్యలు తీసుకోనబడతాయని ,పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అభ్యర్థులు గానీ లేదా వారి రాజకీయ పార్టీ లు గానీ ఎన్నికల రాజకీయ ప్రకటనలు ప్రసార తేదీకి కనీసం మూడు రోజుల ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఎం.సి.ఎం.సి కమిటీ కి దరకాస్తు చేసుకోవాలని, దరకాస్తు వచ్చిన తదుపరి 48 గంటలలో దానిని కమిటీ పరిశీలించి, జిల్లా కలెక్టర్ ద్వార ఈ కేంద్రం అనుమతి ఇస్తుంది అని తెలియజేశారు. అంతే కాకుండా టి.వి.లలో, సోషల్ మీడియాలో, మరియు పత్రికలలో వచ్చే వివిధ రకాల పేయీడ్ న్యూసును (చెలింపు వార్తలను) మరియు ఎనికల నియమావళి ఉల్లంఘణ వార్తలను ఈ కేంద్రం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ , 24 గంటలు పని చేస్తుందని, ఒక వేల ఎవరైనా ఉల్లంఘన లకు పాల్పడితే ,మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి ద్వారా తగు చర్యలు తీసుకునే విధంగా ఈ మీడియా కేంద్రం పనిచేస్తుందని ఒక ప్రకటన లో తెలియ జేశారు.కావున అభ్యర్థులందరూ దీనిని గమనిచాలని సూచించారు. ఈ మీడియా సర్టిఫికేషన్ కమిటీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తుందని, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్ నోడల్ అధికారిగా పని చేస్తారని, ఈ కమిటీ లో నల్గొండ రెవెన్యూ డివిజనల్ అధికారి  జయ చంద్రా రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ శేషు, కేంద్ర ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వర రావు, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేటిక్స్ అధికారి గణపతి రావు, ఇతర సభ్యులుగా ఉంటారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking