నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కై 22లోగా దరఖాస్తు చేసుకోవాలి
*ఆర్టిసి ఆర్ఎం వరప్రసాద్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
టిఎస్ఆర్టిసిలో నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు గాను ఈ నెల 17 నుండి 22వరకు ఆన్ లైన్లోదరఖాస్తు చేసుకోవాలని నల్లగొండ ఆర్టీసి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ కోరారు. సిఎం, బికాజ్, బిఎస్సి, బిబిఎ, బిసిఎ 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారు అర్హులని ఆయన తెలిపారు. www.tsrtc.telangana.gov.in ద్వారా ఆన్ లైన్ చేసుకోవాలని కోరారు. విద్యార్హతలు, ధకవపత్రాల పరిశీలన స్థానికత ఆధారంగా ఉంటుందన్నారు.