పెద్దమ్మ తల్లికి ఆదాయం పుష్కలం

పెద్దమ్మ తల్లికి ఆదాయం పుష్కలం

– భక్తులకు అరకొర ప్రసాదం

– ఇదేమిటని ప్రశ్నిస్తే ఇది ఇంతే అంటున్న సిబ్బంది
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత ప్రతినిధి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం జగన్నాధపురం గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మ తల్లి) ఆలయంకు ఆదాయం పుష్కలంగా వస్తున్నప్పటికీ భక్తులకు మాత్రం అరకొర ప్రసాదం అందించడం విమర్శలకు తావిస్తోంది.

ఆదివారం ఉదయం పెద్దమ్మ తల్లి దేవాలయముకు భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తున్న క్రమంలో పులిహోర ప్రసాదం అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీనిపై కొందరు భక్తులు ప్రశ్నించగా ప్రసాదం అయిపోయిందని అందుకే అరకొరగా పెట్టాల్సి వస్తుందని సమాధానం చెప్పడం గమనించాల్సిన విషయం. భక్తులకు ప్రసాదం ఇచ్చే విషయంలో కూడా సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పట్ల పలువురు మండిపడుతున్నారు. ప్రసాదం పంపిణీ పై ఈవో దృష్టికి తీసుకువెళ్లగా ఉచితంగా ప్రసాదం ఇస్తున్నప్పుడు కొద్దిగా ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు అనడం సరికాదని మాట్లాడడం దారుణం. భక్తుల రాకతోనే పెద్దమ్మ తల్లి ఆలయం అభివృద్ధి దినదినంగా చెందుతున్నప్పటికీ భక్తులకు ప్రసాదం పంపిణీ విషయంలో శ్రద్ధ చూపించడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రసాదం ఉచితంగా ఇస్తున్నామని మాట్లాడడం చూస్తే భవిష్యత్తులో ఈ ప్రసాదానికి కూడా వెలకట్టే అవకాశం లేకపోలేదని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భక్తులకు ఐదు నుంచి పది మెతుకుల వరకు ప్రసాదం అందించడం చూస్తే ఈ దేవాలయంపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ సరిగా లేనట్లుగా కనిపిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking