విజయ పాలశీతల కేంద్రoలో ఆసుపత్రి నిర్మాణాన్ని అపుచేయాలి
_జాక్ చైర్మన్ భైరవభట్ల చక్రధర్
చేర్యాల,జనవరి 09 అక్షితన్యూస్ : చేర్యాల మండల కేంద్రంలో ఒక నూతన ప్రభుత్వ భవన నిర్మాణం జరగాలంటే,రైతులకు ఉపయోగపడే నిర్మించి ఉన్న భవనాన్ని కూల్చాల్సిందేనా? చేర్యాలలో అభివృద్ధి పేరిట విద్వస్మం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని వెంటనే వాటి పై కోర్టులో దావా వేస్తామని జాక్ చైర్మన్ భైరవభట్ల చక్రధర్ హెచ్చరించారు. సోమవారం విజయ డైరీ రైతులు అధ్యక్షులు అంజిరెడ్డి జాక్ బృందం ను కలిసిన నేపథ్యంలో డైరీ ని సందర్శించిన జాక్ బృందం సమగ్రంగా పరిశీలించారు.12 ఏళ్ల క్రితం ఆనాటి ప్రభుత్వం చేర్యాల విజయ డైరీ కి 2.5 ఎకరాలు కేటాయించి డైరీ ని ఏర్పాటు చేశారని,ఆనాటి నుండి ఇప్పటి వరకు డైరీ తెలంగాణా రాష్ర్టంలో నెంబర్ 2 స్థానంలో ఉందని చక్రధర్ అన్నారు.నడుస్తున్న డైరీ ని కూల్చి దావకాన కట్టడం ఏంటి అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ని విమర్శించారు.మరోచోట ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎంపికచేసి ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రిని
నిర్మించాలన్నారు.మంగళవారం చేపట్టిన శంకుస్థాపన పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అలాగే మంత్రి హరీష్ రావు పునరాలోచించాలని చక్రధర్ అన్నారు.ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు మెయిల్ ద్వారా విషయాన్ని చేరవేస్తామని అలాగే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్ర్ ఎండి చంద్రశేఖర్ రెడ్డిని జాక్ బృందం రైతులు కలుస్తామని చక్రదారి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫార్వార్డ్ బ్లాక్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి అందే బీరన్న, 64 గ్రామాల పాల ఉత్పత్తి రైతుల సంఘం అధ్యక్షులు అంజిరెడ్డి,వంశిరెడ్డి,జిల్లా విద్యార్టీ సంఘం అద్ధ్యక్షులు పుల్లని వేణు, మరియు గ్రామాల రైతులు పాల్గొన్నారు.