మానిక్ రాజ్ కు ఘన వీడ్కోలు

మానిక్ రాజ్ కు ఘన వీడ్కోలు
శాలువాలతో సత్కరించిన సిబ్బంది
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ అదనపు చీఫ్ ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తించి కేంద్ర ఆర్ధిక వ్యవహారాల జాయింట్ సెక్రటరీగా బదిలీపై వెళ్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి కె. మానిక్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళవారం ప్రధాన ఎన్నికల కార్యాలయంలో సెక్షన్ అధికారి శ్రీమతి సరస్వతి, ఏఎస్ ఓ యస్. గోవర్దన్ తదితరుల బృందం శాలువాలు కప్పి పూల బోకెలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. మానిక్ రాజ్ మాట్లాడుతూ అధికారులకు బదిలీలు సహజమని, ఏ భాధ్యతలు అప్పగించినప్పటికి అంకిత భావంతో పనిచేస్తే ఆత్మ సంతృప్తి ఉంటుందన్నారు.

ప్రజలతో మమేకమై మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో విధులు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏయస్ ఆరీఫ్, ఏ.ప్రసాదు, హరీష్, సాంభశివరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking