ఆలయ అభివృద్ధికి కృషి

ఆలయ అభివృద్ధికి సహకరిస్తానన్న మంత్రి హరీష్ రావు

చేర్యాల,జనవరి10 అక్షితన్యూస్: చేర్యాల పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సందర్శించి అర్చకుల చేత మహా ఆశీర్వచనం తీసుకున్నారు. వికాస తరంగిణి మహిళా బృందం అడిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సముఖత వ్యక్తం చేస్తూ దేవాలయ సంపూర్ణ అభివృద్ధికి పాటుపడతానని, సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల కాలం నాటి ప్రాచీన దేవాలయం ఇది కాబట్టి దీనిని సంపూర్ణ అభివృద్ధికి తప్పనిసరిగా పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దేవాలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతంతో మంత్రి హరీష్ రావును కోవెలకు ఆహ్వానించి మహదాశీర్వచనం అందజేశారు. మంత్రి కి వికాస తరంగిణి మహిళలు మంగళహారతులతో జై శ్రీమన్నారాయణ నామస్మరణతో స్వాగతం ఘనంగా చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,ప్రధాన అర్చకులు శేషాచార్యులు, మూర్తి స్వామి, పరిచారిక రాజస్వామి, వికాస తరంగిణి భక్తులు, ఆలయ చైర్మన్ అంకుగారి స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి, రామచంద్రన్ గుప్తా, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking