చేర్యాల డివిజన్ ఇక లేదా?

చేర్యాల రెవెన్యు ఏర్పాటు విషయాన్ని మరచిన రాష్ట్ర ప్రభుత్వం

చేర్యాల,జనవరి11అక్షితన్యూస్ : చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన “చేర్యాల రెవెన్యు డివిజన్” ఏర్పాటు విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరిచినట్లేనా అని అడ్వకేట్ సురేష్ కృష్ణ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంపై 2016 సంవత్సరం నుండి వివిధ రూపాల్లో చేర్యాల ప్రాంత ప్రజలు,ప్రజా ఉద్యమాన్ని సాగించారని.ఈ క్రమంలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి,ధూల్మిట్ట మండలాల్లోని 54 గ్రామ పంచాయతీలు,మండల పరిషత్ లు, జెడ్పిటి సిలు చేర్యాల రెవెన్యు డివిజన్ ఏర్పాటు విషయంలో తీర్మానాలు చేశారు.చేర్యాల మున్సిపల్ ఎలక్షన్ సమయంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేర్యాల రెవెన్యు డివిజన్ ఏర్పాటు అంశం ముఖ్య మంత్రి పరిధిలో ఉందన్నారు.అదే సంవత్సరంలో జిల్లా మంత్రి హరీష్ రావు చేర్యాల రెవెన్యు డివిజన్ ఏర్పాటు విషయంలో ఫీజబులిటి (సాధ్యాసాధ్యాలపై) స్థానిక ఎమ్మార్వోల నుండి రిపోర్టు అడగడం జరిగిందన్నారు.ఇన్ని జరిగినా కూడా ఇంతవరకు డివిజన్ విషయంపై పట్టించుకునే నాధుడే లేదన్నారు. చేర్యాల డివిజన్ ఏర్పాటు విషయంలో అనుకూలంగా చేసిన తీర్మానాలు ఏమయ్యాయి? మంత్రి అడిగిన ఫీజబులిటి రిపోర్ట్స్ ఏమయ్యో? ఈ విషయాలు ఇలా ఉంటే,కొందరు మాత్రం సిఎంఓ ఆఫీస్ లో పెండింగ్ ఉందని ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు.చేర్యాల రెవెన్యు డివిజన్ ఏర్పాటు విషయం ఎంత వరకు వచ్చిందని సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తు చేయగా,చేర్యాల రెవెన్యు డివిజన్ ఏర్పాటుకు సంబందించిన ఎలాంటి ప్రక్రియ మెదలు కాలేదని సమాచారం లభించిందన్నారు. ఇప్పటికైనా చేర్యాల ప్రాంత ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మంత్రి హరీష్ రావు చేర్యాల రెవిన్యూ డివిజన్ ఏర్పాటు విషయంపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి చేర్యాల డివిజన్ ఏర్పాటు చేసి, చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చాలని అడ్వకేట్ సురేష్ కృష్ణ కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking