నాగార్జునసాగర్ యూత్ హాస్టల్లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
అక్షిత ప్రతినిధి నాగార్జునసాగర్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా, బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పేరుగాంచిన నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ లోని భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలోని యూత్ హాస్టల్ నందు గురువారం నాడు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ హాస్టల్ కేర్ టేకర్ డి. శ్రీనివాస్ రెడ్డి ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కొబ్బరికాయలను కొట్టారు.అనంతరం యూత్ హాస్టల్ క్యాంటీన్ నిర్వహకులు షేక్ మస్తాన్ వలి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పుణ్యాఫలంగా ఈనాడు ఈ విశాల భారతావని శాంతి సౌబ్రతుత్వాలతో విలసిల్లడానికి ఆనాటి మహానుభావులు ఎన్నో త్యాగాల ఫలితంగా ఈనాడు మనం ఆ ఫలాలను అనుభవిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ హాస్టల్ సిబ్బంది దుర్గయ్య మరియు షేక్ సాజిద్ తోపాటు షేక్ బాషిత్, అర్జున్ రెడ్డి, ఖుషి, చెర్రీ తదితరులు ఈ జెండా పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు.