నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి

నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి

వరంగల్,అక్షిత బ్యూరో : సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా హనుమకొండ జిల్లా ఏఐకేఫ్ మరియు ఏఐకేఎస్ రైతు సంఘాల ఆధ్వర్యంలో బైకు ర్యాలీ వేయి స్తంభాల గుడి నుండి కాళోజి సెంటర్ వరకు తీయడం జరిగింది. ఈ ర్యాలీ కి ముఖ్య అతిథులుగా హనుమకొండ జిల్లా ఏఐకేఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎన్ రెడ్డి హంసా రెడ్డి ఏఐకేఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చుక్కయ్య హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి అక్రమంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని రైతులు పండించిన అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సూచన మేరకు సీ2 ప్లస్ 50% ప్రకారం మద్దతు ధరలను గ్యారెంటీ చట్టం చేయాలని రైతుల కౌలు రైతుల రుణాలను రద్దు చేయాలని విద్యుత్ బిల్లును రద్దు చేయాలని రైతుల మోటార్లకు మీటర్లు వద్దని వ్యవసాయ పంటలకు బీమా పథకం అమలు చేయాలని కోరారు రైతులకు వ్యవసాయ కార్మికులకు 60 సంవత్సరాలు పైబడిన వారికి నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరినారు ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో మృతి చెందిన రైతులకు నష్టపరిహారము ఇవ్వాలని ఉద్యమము సందర్భంలో పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు దామెర సుదర్శన్ సిలువేరు నరేష్ బొల్లం సాంబరాజు మేకల సారంగపాణి సిలువేరు శ్రీనివాస్ దామెర మల్లేష్ మంద సుధాకర్ మంద చందు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking