పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

వరంగల్,అక్షిత బ్యూరో : 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అధికారులు సిబ్బంది, చిన్నారులకు మిఠాయిలను అందజేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు అశోక్ కుమార్, వెంకటలక్ష్మి, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, సంజీవ్, సురేష్ కుమార్ తో పాటు ఏసీబీలు ఆర్ ఐ లు ఇన్స్పెక్టర్లు పరిపాలన విభాగం సిబ్బంది ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking