సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి * సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం * ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు * ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు * మురిసిన విద్యార్థులు జోష్ లో తల్లిదండ్రులు

సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి
* సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం
* ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
* ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
* మురిసిన విద్యార్థులు జోష్ లో తల్లిదండ్రులు
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్ అన్నారు. గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయ ఆవరణలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎస్ అండ్ పిసి సిబ్బంది ముఖ్య అతిథిని వేదిక వద్దకు తీసుకొని రాగా ముఖ్య అతిథి డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్పొరేట్ ఏరియాలోని కార్మికులకు కార్మిక నాయకులకు సూపర్వైజర్లకు అధికారులకు ఇతర సిబ్బందికి 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తరువాత విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అలాగే ఎస్‌ఎస్‌ఓ జాకీర్ హుస్సైన్ కి ర్యాంక్ బహుమతి ప్రధానం చేశారు మొక్కల రాజశేఖర్ కి సన్మానం చేశారు. అనంతరం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ముఖ్యఅతిధి డైరెక్టర్ చంద్రశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా
ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్పొరేట్ ఏరియాలోని కార్మికులకు కార్మిక నాయకులకు సూపర్వైజర్లకు అధికారులకు ఇతర సిబ్బందికి 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తమ సింగరేణియన్లు ఉత్తమ అధికారులుగా ఎంపికైన 12 మంది అభినందించారు.
ఉత్తమ కార్మికులుగా ఎంపికైన వారిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారు కూడా సంస్థ అభివృధ్ధికి కృషి చేయాలన్నారు. మన దేశం ఏటేటా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ తన ప్రతిభను మరింత మెరుగు పరుచుకుంటూ అగ్ర దేశాల సరసన నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సారధ్యంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించుకొని సర్వ సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర దేశముగా భారత దేశము అవతరించినదని పేర్కొన్నారు.


స్వపరిపాలన లక్ష్యంతో సాధించుకొన్న గణతంత్ర రాజ్యాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. దేశం నలుమూలల 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకోనుటం జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సత్యనారాయణరావు సింగరేణి జిఎంలు బసవయ్య ఆనందరావు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.