సమస్యల వలయంలో ఎస్ ఎల్ బి సి హాస్టల్

నకిరేకల్ అక్షిత ప్రతినిధి

ప్రభుత్వ హాస్టళ్లు అంటే సాధారణంగా సమస్యలకు నెలవుగానే పేర్కొంటారు అంతా. దానికి తగ్గట్లే పలు వసతి గృహాల్లో ఇబ్బందులు తాండవిస్తున్నాయి అని బిస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. నకిరేకల్ పరిధిలోని వున్నా ఎస్ ఎల్ బి సి హాస్టల్ సమస్యల వలయంలో చిక్కుకుంది అన్నారు. గురువారం రోజున హాస్టల్ ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ హాస్టల్ లో రెండు దిక్కుల ప్రహారీ గోడ కూలడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. ప్రహారీ గోడ కూలడం వలన అపరిచితులు లోనికి వచ్చి శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది అని అన్నారు. ఇక్కడ అభివృద్ధి కోసమే పార్టీ మారిన అని చెపుతున్న ఎమ్మెల్యే కు ఈ హాస్టల్ కనబడడం లేదా అని అన్నారు గ్రామాలలో అభివృద్ధి శిలాఫలాకాలకే పరిమితం అయితుందన్నారు..ఎమ్మెల్యే స్పందించి ప్రహరీ గోడ నిర్మించి హాస్టల్లో మురుగునీరు పోయేటట్టు డ్రైనేజీ నిర్మించాలన్నారు..ఎమ్మెల్యే వెంటనే పర్యటించి సమస్యలు తీర్చాలన్నారు లేనిపక్షంలో బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తడక విజయ్,మండల అధ్యక్షులు చెట్టిపల్లి శంకర్,ఉపాధక్షులు చిత్తలూరి శివ,బివిఫ్ మండల కన్వీనర్ గద్దపాటి వంశీ, వంటేపాక ప్రదీప్,చెట్టిపల్లి మహేష్,జస్వ, నితిన్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking