భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచడమే బిఎస్పీ లక్ష్యం బిఎస్పీ జిల్లా అధ్యక్షులు తేజవత్ అభినాయక్
భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచడమే బిఎస్పీ లక్ష్యం
బిఎస్పీ జిల్లా అధ్యక్షులు తేజవత్ అభినాయక్
మరిపెడ అక్షిత ప్రతినిధి:-
భారత రాజ్యాంగాన్ని కాపాడి, పూర్తిస్థాయిలో అమలు పరిచడమే బిఎస్పీ లక్ష్యం అని బిఎస్పీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తేజవత్ అభినాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ మరిపెడ లొ బహుజన్ సమాజ్ పార్టీ మండల కన్వీనర్ జినక కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 74వ, ఘనతంత్ర దినోత్సవం బిఎస్పీ కార్యాలయం ముందు ఘనంగా నిర్వహించరు. ఈ కార్యక్రమానికి బిఎస్పీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తేజవత్ అభినాయక్ ముఖ్యఅతిధి గా పాల్గోని జాతీయ జండా ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జిల్లా అధ్యక్ష,కార్యదర్శిలు తేజవత్ అభినాయక్,ఐనాల పరశురాములు మాట్లాడుతు మహనీయులు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా సకల జనులకు ప్రాధమిక, ఆదేశిక సూత్రాలతో సమాన హక్కులను, రాజ్యాంగ పలాలు అందించారని వీటిని పూర్తిగా అమలుపరిచే సందర్బంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలుపర్చాలంటే కేవలం బహుజన్ సమాజ్ పార్టీ తోనే సాధ్యమవుతుందని జాతీయ అధ్యక్షులురాలు కుమారి మాయావతి గారు, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గార్లు అలుపెరగని పోరాటాలు చేస్తున్నారని ఇదే స్పూర్తితో బహుజనులు కలిసి కట్టుగా బహుజన రాజ్యాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రంలో బిఎస్పీ మండల నాయకులు ఆంగోత్ రాజునాయక్, కొండ్రు పరశురాములు, వీరన్న, భాసు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.