అభివృద్ధికి ఆమడ దూరం కిష్టాపూర్ లో నాలుగో వార్డు….. ప్రజల సమస్యలు పట్టించుకోని కౌన్సిలర్….

అభివృద్ధికి ఆమడ దూరం కిష్టాపూర్ లో నాలుగో వార్డు…..

ప్రజల సమస్యలు పట్టించుకోని కౌన్సిలర్….

మేడ్చల్, అక్షిత బ్యూరో: మేడ్చల్ పురపాలక పరది అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న కిష్టాపూర్ లో నాలుగో వార్డు మేడ్చల్ పురపాలక ఏర్పడి మూడు కౌన్సిల్ పూర్తి చేసుకున్న కౌన్సిలర్ల లు కానీ కిష్టాపూర్ లో నాలుగో వార్డ్ లో సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉంది పేరు గొప్ప ఊరు దిబ్బగా గొప్పలు చెప్పుడే తప్ప చేసింది ఏం లేదంటూ మేడ్చల్ పురపాలక పరిధిలో అస్తవస్తంగా తయారయిందని మేడ్చల్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పరుశరాం మాదిగ అన్నారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలకలో ఒకరిపై ఒకరు అవనితి ఆరోపణలు చేసుకుంటూ ప్రజాసమస్యలు గాలికి వదిలేయడం జరుగుతుందని అన్నారు. నాలుగో వార్డు కిష్టాపూర్ లో ఎన్నికల్లో గెలిచి మూడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎక్కడ ఒక సిసి రోడ్డు కూడా నిర్మాణం జరగలేదని సమస్యలు పట్టించుకోని కౌన్సిలర్స్ ప్రజలకు అందుబాటులో ఉండరు. హైదరాబాద్ మహా నగరానికి కూత వేటు దూరంలో ఉన్న మేడ్చల్ పురపాలక పరిధిలో సిసి రోడ్లకు అభివృద్ధికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. ఊర్లకు వచ్చే దారి మొత్తం మట్టితోనే ఉందని ఎస్సి బస్తీ మూడు చింతల దగ్గర గతంలో సిసి రోడ్లు పగలగొట్టి డ్రైనేజీ పైప్లైన్లు వేశారు.

కానీ గుంతలు లో మట్టిని పూడ్చకుండా అలాగే వదిలేయడంతో గుంతల్లో రోడ్లపై నడిచే వాళ్ళు అందులో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు అయితే ఆసుపత్రిలో పాలై నడవని స్థితిలో ఉన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని కౌన్సిలర్లు ఉంటే ఏంది లేకుంటే ఏంది అన్నారు.ఇప్పటికైనా సిసి రోడ్లు డ్రైనేజీలు వీధిలైట్లు పారిశుద్ధ్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలాగా నాలుగో వార్డులో స్థానిక కౌన్సిలర్ స్పందించి ప్రజల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు….

Leave A Reply

Your email address will not be published.

Breaking