జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం ల ద్వారా అనధికార నిర్మాణాల తొలగింపు

జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం ల ద్వారా అనధికార నిర్మాణాల తొలగింపు.

వరంగల్,అక్షిత బ్యూరో: 14 డివిజన్ లో అక్రమ నిర్మాణాల తొలగింపు బల్దియా పరిధిలోని 14 వ డివిజన్ దేశాయిపేట్ ప్రాంతంలో అనధికారంగా నిర్మించిన ఏసీ షెడ్,
కాంపౌండ్ వాల్ ను జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ బృందం అధ్వర్యంలో బల్దియా డి.ఆర్.ఎఫ్. టీమ్ అట్టి నిర్మాణాన్లను సోమవారం తొలగించడం జరిగింది.
అనధికారికంగా స్థలాలను అక్రమించుకుని నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోని, క్రిమినల్ కేసు నమోదు.చేసి అట్టి నిర్మాణాలను తొలగించడం జరుగుతుందని సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు.
టీఎస్ బి పాస్ ద్వారా అనుమతి పొందిన తర్వాత మంజూరు చేసిన ప్లాన్ (నక్షా) ప్రకారమే ఎలాంటి అతిక్రమణలు లేకుండా భవనాలు నిర్మించుకోవాలని తెలిపారు.
ఇట్టి కార్యక్రమం లో రెవిన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ మరియు బల్దియా అధికారులు, డిఆర్ ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking