తెలంగాణకు పట్టిన చీడ పీడ
గులాబీ నీడను బొంద పెడదాం
డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్
తుంగతుర్తి అక్షిత : రానున్న ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ పార్టీకి విఆర్ఎస్ ఇచ్చి గులాబీ నీడను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు.ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోదో యాత్రను పిసిసి అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తుంగతుర్తి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సోమవారం జోడోయాత్ర తుంగతుర్తి నియోజకవర్గ కన్వీనర్ గుడిపాటి నరసయ్య ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ అధ్యక్షతన సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా వెళ్లి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి యాత్ర చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అరవై రోజులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు చేస్తూన్న మోసాలు, ఆగడాలు హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా వివరిస్తామన్నారు. అనంతరం యాత్ర కన్వీనర్ గుడిపాటి నరసయ్య యాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ… అబద్ధాలు చెప్పే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని తేల్చి చెప్పారు.కుటుంబ పాలనతో సొంత పార్టీ నాయకులు కూడా విసిగిపోయారని తెలిపారు. రైతులకు చేస్తున్న మోసాలను వివరిస్తూ ప్రజాసంక్షేమ కావాలంటే, ఇందిరమ్మ ఇల్లు రావాలంటే రైతుల ముఖాలలో చిరునవ్వులు చిందాలంటే, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే పేదల జీవితంలో మార్పు రావాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతం, వడ్డేపల్లి రవి, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, జిల్లా నాయకులు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..