తుమ్మల మాట ‘త’న్నీరు మూట -సీతారామ ప్రాజెక్ట్ కు నిధుల ధార-పాలేరు కు గోదావరి జల ధార -లోడిగ వెంకన్నయాదవ్ సామాజిక వెత్త(పాలేరు)

తుమ్మల మాట ‘త’న్నీరు మూట

-సీతారామ ప్రాజెక్ట్ కు నిధుల ధార-పాలేరు కు గోదావరి జల ధార

-లోడిగ వెంకన్నయాదవ్ సామాజిక వెత్త(పాలేరు)

ఖమ్మం/ అక్షిత బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లా కు 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు 3 లక్షల ఎకరాల స్థిరీకరణ తో వెరసి 10 లక్షల ఎకరాల్లో గోదావరి నీటిని పొలాల్లోకి మళ్ళించడానికి 15,000 వేల కోట్ల అంచనా ఖర్చు తో సీతారామప్రాజెక్ట్ ను తుమ్మల పట్టుబట్టి సాధించి కేసీఆర్ తో శంకుస్థాపన చేయించారు. తెలుగుదేశం పార్టీ నుండి ఆనాటి టిఆర్ యస్ పార్టీ లోకి తుమ్మల చేరేప్రయత్నం జరిగినప్పుడు ముందు గా తుమ్మల నీకు ఏమి కావాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగినప్పుడు నా ఏకైక కల లక్ష్యం సీతారామాప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా లో 10 లక్షల ఎకరాలకు నీటిని అందించి నారైతు మొహం లో ఆర్థిక చిరునవ్వు లు చూడటమే తప్ప నాకెలాంటి లాభాపేక్ష లేదని నా కల నెరవేరిననాడు నా రైతుల సుఖ సంతోషాలతో ఉండటం చూసి నా రాజకీయ జీవితాన్ని ముగిస్తానంటు నిర్మోహమాటంగా కేసిఆర్ కు తుమ్మల చెప్పిన విషయం బహిరంగ సత్యం.తుమ్మల మాటకు విలువను ఇచ్ఛి నిజాయితీగా అంగీకరించి నీకోసం నేను అడిగితే నువ్వు ప్రజలకోసం అడుగుతున్నావు కాబట్టి ఆరునూరైనా నీ లక్ష్యం నెరవేరుస్తాను మీరు పార్టీలో చేరండి అని తుమ్మలను టీఆరెస్ లోకి ఆహ్వనించి సీతారామ ప్రాజెక్ట్ కు అంకురార్పణ చేసిన విషయం విధితమే.పాలేరుకు నీటిని తీసుకురావడం సీతారామ ప్రాజెక్ట్ ధీర్గకాలిక పని కాబట్టి తక్షణమే పాలేరు రైతులకు నీటిని అందించే ప్రణాళికలు రచించమని కోరగా భక్తరామదాసు ప్రాజెక్టును మంత్రి గా ప్రాజెక్టు పనులు ఉరకలు పెట్టించి పాలేరు రైతాంగానికి సాగు నీటిని అందించడంలో తమ్మల సఫలీకృతం అయ్యారు. తుమ్మల పనితీరును అభినందించిన ముఖ్యమంత్రి సీతారామ ప్రాజెక్ట్ పనులను వేగవంతం భాత్యను అప్పగించారు. పనులు ఉరకలు వేస్తు పనులపురోగ అభివృద్దిలో ఉన్నతరుణంలో ఊహించని పరిణామాలతో తుమ్మల పాలేరు లో ఓటమి చెందడం సీతారామప్రాజెక్ట్ నత్తనడకన పడింది.కేసీఆర్ తుమ్మల ప్రాధాన్యతను గుర్తించిన ప్రతిసారి సీతారామ ప్రాజెక్ట్ పనులగురించి తుమ్మల గుర్తుచేశారు.ఇటీవల పొంగులేటి పార్టీ వీడుతుండటం అంశం తెరపైకి వచ్ఛిన తర్వాత ఖమ్మంజిల్లా లో తుమ్మల ప్రాధాన్యత గుర్తించి మంత్రి తన్నీరు హరీష్ రావు స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్ళి పార్టీ కి మీ అవసరం అని అడిగి న వేళ్ళ ప్రదానం గా తుమ్మల సీతారామ ప్రాజెక్ట్ ప్రస్తానం తీసుకు వచ్ఛారు.అంతేకాదు టిఆర్ యస్ నుండి బీఆర్ యస్ గా పార్టీ రూపాంతరం చెంది ఖమ్మం లో మొదటిగా బహిరంగ సభ పెట్టే సందర్భంగా సభ సక్సెస్స్ చేసే సందర్భంగా యావత్ పార్టీ యంత్రాంగం తుమ్మల ఇంటికి వెళ్ళిన సందర్భంగా తన మనోగతం హరీష్ కి వివరించారు.ఖచ్చితంగా ఈ ఆర్థిక సంవత్సరం లో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసే భాద్యత తో ప్రభుత్వం ఉంది అన్న కేసీఆర్ మాట హరీష్ నోట తుమ్మలకు చేరవేసినట్టు గా తెలుస్తోంది. దీనిలో భాగంగానే 2023-24 బడ్జెట్లో 963 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి గోదావరి జలాలు సీతారామప్రాజెక్ట్ ద్వారా పాలేరు కు తెప్పించి ఉమ్మడి ఖమ్మంజిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగు నీరు ఈ సంవత్సరం అందిస్తాము అని అసెంబ్లీలో ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రస్తావించారు.ఈ అంశంపై తుమ్మల నాగేశ్వరరావు ఎంతో సంతోషం వెలుబుచ్ఛారు.తన చిరకాల కోరిక సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు గోదావరి జలాలతో పాలేరు ప్రజల పాదాలు కడుగుతా అన్నమాట నిలబెట్టుకోటానికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్ఛి పెద్దమొత్తం లో సాగునీటి నిదులు కేటాయించడం శుభపరిణామం గా తుమ్మల తన ఆకాంక్ష కు అంకురార్పణే సీతారామాప్రాజెక్టు అని తుమ్మల ప్రగాఢ విశ్వాసం తో ఉన్నారు.అన్న మాటలో చెప్పిన దానిలో తన మాటలో విశ్వసనీయతలో ఏమాత్రం అతిశయోక్తి లేదని ప్రజలు విశ్వశిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking