కంటి వెలుగు పథకం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని…
దుండిగల్ పురపాలక వైస్ చైర్మన్ తుడుం పద్మారావు..
మేడ్చల్, అక్షిత బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం చేపట్టిన కంటి వేలుగు పథకం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని దుండిగల్ పురపాలక వైస్ చైర్మన్ తుడుం పద్మారావు అన్నారు..బుధవారం దుందిగల్ పురపాలక పరిధిలో బహదూర్ పల్లి 14 వ వార్డు డబల్ బెడ్ రూమ్ నందు నిర్వహించిన కంటి వెలుగు రెండోవ విడత కార్యక్రమాన్ని దుందిగల్ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులని, కంటి పరీక్షలకు వెళ్ళేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ తీసుకువెళ్లాలని కోరారు. కంటి ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు సంబంధిత వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తారని,అనంతరం ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తారన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు,ఈ కార్యక్రమంలో పురపాలక కమీషనర్ కే.సత్యనారాయణ రావు, కౌన్సిలర్ ఎలాగారి సత్యనారాయణ,రెవిన్యూ ఆఫీసర్ బి.శ్రీహరి రాజు, ఆరోగ్య మరియు వైద్య సిబ్బంది, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.