యాసంగి 2021-22 సి.యం.అర్ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
2021 – 22 యాసంగి సీజన్
సి.యం.అర్. డెలివరీ ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని మిల్లర్ లు,ఎఫ్.సి. ఐ అధికారులను అదనపు కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్ రావు ఆదేశించారు.బుధవారం అదనపు కలెక్టర్ పౌర సరఫరాల శాఖ,ఎఫ్. సి. ఐ అధికారులు,రైస్ మిల్లర్ల తో కలిసి నల్గొండ పట్టణం లో ఎఫ్.సి. ఐ గోదాం బఫర్ నిల్వ కేంద్రం ను సందర్శించి ఆవరణ లో మొక్క ను నాటారు. యాసంగి 2021 – 22
సి.యం.అర్ డెలివరీ,సి.యం.అర్ లారీల నుండి ఎఫ్.సి. ఐ.గోదాం లో అన్ లోడింగ్ సమస్యలు పై చర్చించారు. యాసంగి 2021 – 22 సీజన్ లో 2 లక్షల 23 వేల మెట్రిక్ టన్నుల సి.యం.అర్ లక్ష్యం కాగా ఒక లక్షా 93 వేల మెట్రిక్ టన్నుల సి.యం.ఆర్.డెలివరీ చేయగా ఇంకా 30 వేల మెట్రిక్ టన్నుల సి.యం.అర్ డెలివరీ చేయ వలసి వుందని,2023
మార్చి 31 లోగా పూర్తి చేయాలని మిల్లర్ లను,మార్చి 31 వరకు యాసంగి 2021 -22 సి.యం.అర్ మాత్రమే తీసుకోవాలని ఎఫ్.సి. ఐ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.అదనపు కలెక్టర్ వెంట పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర రావు,రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నల్గొండ అధ్యక్షులు యాధ గిరి,రైస్ మిల్లర్ల అసోసి యేషన్ ప్రతినిధులు,ఎఫ్.సి. ఐ.అధికారులు ఉన్నారు.