ప్రగతి పథకాలు
ప్రతి గడపకు చేర్చాలి
బిఆర్ఎస్ పటిష్టతకు కృషి
క్షేత్ర స్థాయి గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం
ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ప్రతి గడపకు కేసిఆర్ సర్కార్ నుంచి ప్రగతి ఫలాలు అందాయి. ఊరు వాడ అంతా కలియ తిరిగి గులాబీ దళపతి, సీఎం కేసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు తెన్నులపై అవగాహన కల్పించాలి. ఎన్నికల తరుణం ఆసన్న మవుతున్న తరుణంలో ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుండ్రు. రానున్న 3,4 నెలల పాటు మిర్యాలగూడ నియోజక వర్గంలోని మిర్యాలగూడ పట్టణం, వేములపల్లి, మాడుగులపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ మండలాల్లోని ప్రతి పల్లె, వార్డుల్లో గులాబీ శ్రేణులు ప్రతి గడపకు అవగాహన కల్పించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే గురువారం వేములపల్లి, మాడుగులపల్లి మండలాలకు చెందిన గులాబీ శ్రేణులతో మిర్యాలగూడ పట్టణంలోని
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు
విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పార్టీ పటిష్టతకు సమిష్టి కృషి అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిస్ అలీ, మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఇరుగు వెంకటయ్య, నల్లగొండ జిల్లా రైతు సంఘం మాజీ అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా మల్లేష్ గౌడ్, కాట్రగడ్డ రాజగోపాల్ రావు, మాడ్గులపల్లి మండల రైతు బంధు సమితి అధ్యక్షులు మిర్యాల మధుసూదన్, పాక్స్ చైర్మన్ గడ్డం స్ఫురదర్ రెడ్డి, జేర్రిపోతుల రాములు గౌడ్, వేములపల్లి సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.