కన్న ఊరిపై మమకారం… కోటితో ఆసుపత్రి

కన్న ఊరిపై మమకారం

కోటితో ఆసుపత్రి నిర్మాణం

పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యం
నూకల వెంకట్ రెడ్డి ఔదార్యం

*నేడు ప్రారంభించనున్న మంత్రి జగదీశ్ రెడ్డి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

కన్న ఊరిపై మమకారంతో ఏకంగా ఆసుపత్రిని నిర్మించారు. పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో కోటితో కన్న ఊరిలో ఆసుపత్రిని కట్టారు. ప్రపంచంలో ఎంతో కోట్లకు పడగలెత్తుతున్నారు. జన్మభూమికి సేవ చేయాలన్న కొంతమందికే కలుగుతుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సేవలందించే కొందరిలో రైతు, వ్యాపారవేత్త నూకల వెంకట్ రెడ్డి తాను పుట్టిన ఊరికే సేవ చేయాలనుకుని నూకల వెంకట్రెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా గ్రామప్రజలకు ఉచిత వైద్య సేవలందించేందుకు మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో ఆసుపత్రి నిర్మించారు. ఆసుపత్రి స్థలం విలువ రూ.25లక్షలు, నిర్మాణానికి రూ.50లక్షలు, రూం.10లక్షలతో ఆధునిక పరికరాలు, మందులు, ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఒక డాక్టర్, సిబ్బంది తదితర వ్యయం అంతా కలిపి కోటి రూపాయలు. రోజు పది గంటలు వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావులు ఈ నెల 17న ప్రారంభిస్తారని ట్రస్టు బాధ్యులు‌ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking