పేపర్ లీకేజీలో సీఎం కుటుంబ సభ్యుల హస్తం

పేపర్ లీకేజీలో సీఎం

కుటుంబ సభ్యుల హస్తం

నిందితులు ప్రవీణ్,
రాజశేఖర్ రెడ్డి
ప్రాణాలకు ముప్పు

కేసును సిబిఐకి అప్పగించి,

జనార్దన్ రెడ్డిని తొలగించాలి

గ్రూప్1 ప్రిలిమ్స్ రద్దు
బిఎస్పి విజయం

బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు,
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన ఉద్యోగ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్ష పేపర్ల లీకేజీలో కవిత, హరీష్ రావు, కేటిఆర్ లకు సంబంధం ఉందని ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిన ద్రోహులపై చర్యలు తీసుకోవాలని ఆరోపించారు.

2016లో జరిగిన పరీక్షల పేపర్ లీకేజీలో కూడా కవిత హస్తం ఉందని ఆరోపించారు. పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల ప్రాణాలకు ప్రాణాపాయం ఉందని వారిని రక్షించకపోతే, ఈ పేపర్ లీకేజీలో పాత్ర ఉన్న పెద్దల విషయం తెలియదని వారిని కాపాడి,వారి నుండి పూర్తి సమాచారం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆమరణ నిరహార దీక్ష శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రారంభించగా, కేసిఆర్ తన పోలీసులను పంపి దౌర్జన్యంగా మా పార్టీ కార్యకర్తలపై దాడి చేసి, తలుపులు పగలగొట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు. అరెస్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయగా, ఇంట్లోనే దీక్ష కొనసాగించారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి పరీక్షలు రద్దు చేసిందని తెలిపారు. కానీ ఈ పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్ అధికారులు ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలతో పనిచేస్తారని వారి ద్వారా నిజాలు బయటకు రావని ఆయన తెలిపారు.అందుకే కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చైర్మెన్ జనార్దన్ రెడ్డిని తొలగించాలని గవర్నర్, రాష్ట్రపతిని కలుస్తామని ప్రకటించారు. గవర్నర్ 317 వ అధికరణ ప్రకారం తమ అధికారాలు ఉపయోగించి జనార్దన్ రెడ్డిని తొలగించాలని, లేదా జనార్దన్ రెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని, సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మిని కూడా విచారించాలని మరియు కాన్ఫిడెన్షియల్ రూంలో ఉండే ఉద్యోగులందరిని విచారించాలని డిమాండ్ చేసారు. భవిష్యత్ లో కూడా తిరిగి ఈ పరీక్షల నిర్వహణ జనార్దన్ రెడ్డి హయాంలో జరపవద్దని, నూతన బాడీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1,ఏఈఈ, డిఎఓ ఉద్యోగాలు రద్దు చేయడం బిఎస్పి,తెలంగాణ ప్రజలు, విద్యార్థుల విజయం అని తెలిపారు. ఇతర పార్టీలు అన్ని నామమాత్రంగానే మాట్లాడారని పేర్కొన్నారని బండి సంజయ్ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.యువకులంతా ధైర్యంగా ఉండాలని,బాగా చదివి ఉద్యోగాలు సాధించాలని, నిరుద్యోగ యువకుల పక్షాన నిరంతరం బిఎస్పి మీ వెంట ఉంటుందని హామీ ఇచ్చారు. రేపోమాపో కవిత అరెస్టు అవుతుందని, తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులను వదిలేసి, ఒక నేరస్థురాలైన కవితను కాపాడేందుకు పాలకులు ఢిల్లీకి వెళ్లారని మర్శించారు. కవిత త్వరలోనే అరెస్టవుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking