అక్రమ నిర్మాణాల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన కాట శ్రీనివాస్ గౌడ్

అక్రమ నిర్మాణాల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన కాట శ్రీనివాస్ గౌడ్
అమీన్ పూర్, అక్షిత ప్రతినిధి :
అమీన్ పూర్ లోని సర్వే నంబర్ 765, 1016, 1056, 1118, 177 లో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని తక్షణమే వారిపై చర్యలు తీసుకొని నిర్మాణాలను అడ్డుకోవాలని మంగళవారం రోజు అమీన్ పూర్ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసి, తహసీల్దార్ కార్యాలయం వద్ద పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్స్ లావణ్య శశిధర్ రెడ్డి, సునీత, మున్న, నాయకులు సుధాకర్, దుద్యాల రవీందర్, ప్రకాష్, మన్నె రవీందర్, రవి గౌడ్, సత్యనారాయణ, మహేష్, విజయ్, రమేష్, మహిపాల్ రెడ్డి, శంకర్, సిద్దు, భిక్షపతి, మల్లేష్, ఈశ్వర్ రెడ్డి, సతీష్, లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking