తెలుగుదేశం పార్టీతోనే బలహీన వర్గాలకు పెద్దపీట. టిడిపి పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేద్దాం టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు
తెలుగుదేశం పార్టీతోనే బలహీన వర్గాలకు పెద్దపీట.
టిడిపి పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పని చేద్దాం
టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు
కోదాడ టౌన్ ,అక్షిత న్యూస్:
బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర్ రావు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుండి క్రమశిక్షణతో, నిజాయితీతో పనిచేసిన తనకు రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించినందుకు గాను తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు,తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వం మూలంగానే నేటి వరకు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా నిలిచిందన్నారు. ప్రపంచంలో హైదరాబాద్ ను అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు అహర్నిశలు కృషి చేశారని అన్నారు.విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని భావించి యువతను విద్య వైపు నడిపించారని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో105 మంది బడుగు బలహీన వర్గాలు, దళితులను నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత టిడిపికే దక్కిందన్నారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష టిడిపి తోనే నెరవేరుతుందన్నారు.కాగా పలువురు నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో ముందుకొచ్చి పార్టీ కోసం పనిచేస్తున్న సైదేశ్వరరావు ను అభినందించారు. వారి రాకతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొన్నదని వారి నాయకత్వంలో పార్టీ బలోపేతానికై కలిసి ముందుకు వెళ్తామన్నారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ కన్వీనర్ ఉప్పుగండ్ల శ్రీనివాసరావు, చిలుకూరు మండల కన్వీనర్ కొండ సోమయ్య, అనంతగిరి మండల కన్వీనర్ చాపల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు ఉన్నం హనుమంతరావు, కొల్లు సత్యనారాయణ, సహదేవ్, గుండు వీరబాబు, షేక్ మస్తాన్, నాగరాజు, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.