బీజేపీలో చేరిన చౌదరిగూడ యువకులు
అక్షితన్యూస్ ఘట్కేసర్:
బిజెపి పార్టీ పట్ల రోజురోజుకీ మరింత ఆదరణ పెరుగుతుందని మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఘట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామం నుండి సుమారు 30 మంది యువకులు పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. వారికి ఈటల రాజేందర్ పార్టీ కండువా కప్పి బుధవారం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ప్రభంజన్ గౌడ్ పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.