దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ అనుదీప్

దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను
ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతుల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్ ఉంచొద్దని, పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు.
ప్రజావాణిలో సమస్యను పరిష్కరించాలని చేసిన దరఖాస్తులు కొన్ని ఇలా ఉన్నాయి.
భద్రాచలం మండలం అశోక్నగర్ కాలనీకి చెందిన బండారు కళావతి భర్త (లేటు) వెంకటరామయ్య సారపాకలోని
ముస్లిం మైనార్టీ కళాశాలలో నైటాచ్మెన్ ఔట్సోర్సింగ్ పనిచేస్తూ 17-12-2022న గుండెపోటుతో మరణించారని
భర్త అకాల మరణం వల్ల ఇద్దరు చిన్నపిల్లలతో ఆర్థిక పరిస్థితులు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నానని 10వ
తరగతి ఉత్తీర్ణత సాధించిన తనకు నాల్గవ తరగతి ఉద్యోగిగా అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన
కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం జిల్లా మైనార్టీ అధికారికి జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఎండార్స్ చేశారు.
చర్ల మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన దుబ్బరాజు చర్ల మండలంలోని వీరాపురం, కత్తిగూడెం,
సుబ్బంపేట, మొగళ్లపల్లి గ్రామాలలో గిరిజన సొసైటీల ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలలో నిబంధనలకు తూట్లు
పొడుస్తూ యాంత్రాలో తవ్వకాలు చేస్తున్నారని, గిరిజనులకు ఆదాయం సమకూర్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని గిరిజనులు పర్యవేక్షణ లేని కారణంగా నీరుకారుతున్నదని కూలీలలో ఎన్ని క్యూబిక్ టీమర్లు ఇసుక తీశారు కూలీల వివరాలు ట్రాక్టర్లు నెంబర్లుతో వివరాలు అందచేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని టిఎస్ఎండిసి పిఓను ఆదేశించారు. టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన కుక్కమూడి సౌజన్య తనకు సొంతింటి స్థలం కలదని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు పడకల ఇల్లు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం
డిఆర్డు ఎండార్స్ చేశారు.


ముల్కలపల్లి మండలం భగత్ సింగ్ గ్రామానికి చెందిన తాళ్ల వీరయ్య తన కూతురు పెండ్లి ఖర్చులకు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన దారా కిట్టయ్య వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకుని
దఫాలుగా మొత్తం చెల్లించానని, అయినప్పటికి కిట్టయ్య వందకు ఐదు రూపాయలు వడ్డీ చొప్పున చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాడని, వడ్డీ తగ్గించి దఫాలుగా చెల్లించు విధంగా వెసులుబాటు కల్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు కొరకు పోలీస్ శాఖకు ఎండార్స్ చేశారు.
అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన కందాళ వెంకటరెడ్డి తనకు తెల్లరేషన్కార్డు రద్దు
చేశారని తిరిగి పునరుద్ధరించు విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు
నిమిత్తం జిల్లా పౌర సరఫరాల అధికారికి ఎండార్స్ చేశారు.
కొత్తగూడెం మండలం రామవరం గ్రామానికి చెందిన సుధీష్ణ తెల్లరేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నానని,
తనకు తెల్లరేషన్ కార్డు మంజూరు చేపించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు కొరకు జిల్లా పౌర సరఫరాల అధికారికి ఎండార్స్ చేశారు. అశ్వారావుపేట మండలం మొద్దులమడ గ్రామ పంచాయతీకి చెందిన కట్టా భీమయ్య మరి కొందరు గిరిజనులు
పంచాయతీ పరిధిలోని ఉడుములబండ, రాళ్లవాగు, మద్యగుంపు, పెద్దమిద్ది గ్రామాల ప్రజలు త్రాగునీరు లేక వాగులలో
చలములు నీరు త్రాగుతున్నామని, వేసవిలో వాగులు ఎండిపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని, బోర్లు వేసి చేతిపంపులు
ఏర్పాటు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు కొరకు తహసిల్దార్కు ఎండార్స్ చేశారు.
ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking