సిపిఐ పార్టీ పాదయాత్రను జయప్రదం చేయండి బిజెపిని గద్దె దించండి దేశాన్ని రక్షించండి – మండల కార్యదర్శి సుందనబోయిన రమేష్

సిపిఐ పార్టీ పాదయాత్రను జయప్రదం చేయండి

బిజెపిని గద్దె దించండి దేశాన్ని రక్షించండి

– మండల కార్యదర్శి సుందనబోయిన రమేష్

నాంపల్లి, అక్షిత న్యూస్:

భారత కమ్యూనిస్టు పార్టీ నాంపల్లి మండల కౌన్సిల్ సమావేశం పార్టీ కార్యాలయంలో జరిపారు ఈ సమావేశం గిరి స్వామి సిపిఐ అధ్యక్షతన జరిగినది సమావేశం ఉద్దేశించి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదిలో తెలంగాణ వాట తేల్చాలి మునుగోడు నియోజకవర్గానికి తాగు సాగు నీరు అందించే డిండి ఎత్తిపోతల పథకాన్ని చర్లగూడెం కిష్టరాయిని పల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని సిపిఐ పాదయాత్ర నాంపల్లి మండల కేంద్రానికి ఈనెల ఏప్రిల్ 26 నుండి 29 వరకు పాదయాత్ర మండలంలోని వివిధ గ్రామాల మీదుగా బయలు దేరుతారు. ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని నాంపల్లి ప్రజలు కార్యకర్తలు నాయకులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు దళిత బంధు అర్హులైన నిరుపేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ గిరి రమ, సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి నేతాల రాజు, మండల కార్యవర్గ సభ్యులు కోరే సత్తయ్య, దండిగా వెంకటయ్య , కుంభం సత్తిరెడ్డి వివిధ గ్రామాల గ్రామ శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking