అర్జీలకు సత్వర పరిష్కారమివ్వండి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

అర్జీలకు సత్వర పరిష్కారమివ్వండి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

ప్రజావాణి ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి,అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను తెలుపుతూ అందించిన అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి అందిన అర్జీలను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతీలాల్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking