బయోమెట్రిక్ తప్పనిసరి: కలెక్టర్ అనుదీప్

బయోమెట్రిక్ తప్పనిసరి: కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:

ఐడిఓసి కార్యాలయంలోని అన్ని శాఖల సిబ్బంది బయోమెట్రిక్ హాజరులో ఇన్, అవుట్ తప్పనిసరిగా వేయాలని
జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం బడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో బయోమెట్రిక్ హాజరు,
ఆరోగ్యమహిళ, కంటివెలుగు, దళితబంధు, రెండవ విడత గొర్రెల పంపిణీ, మున్సిపార్టీలు, గ్రామపంచాయతీల్లో రీడింగ్
రూములు ఏర్పాటు తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల జిల్లా అధికారులు వారి సిబ్బంది సమయ పాలన పాటించు విధంగా
చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతి సోమవారం బయోమెట్రిక్ హాజరుపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తదుపరి
బయోమెట్రిక్ హాజరు ప్రకారం వేతనాలు చెల్లించు విధంగా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. సిబ్బంది తప్పనిసరిగా
ఇన్, అవుట్ బయోమెట్రిక్ వేయాలని ఆయన పేర్కొన్నారు. మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీల్లో రీడింగ్ రూములు
ఏర్పాటు చేయుటకు చర్యలు చేపట్టాలని యంపిడిఓలను ఆదేశించారు. ప్రజల్లో పఠనాశక్తిని పెంపొందించడానికి
ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలలో రీడింగ్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మున్సిపార్టీల అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ మేరకు చేపట్టాల్సిన పనులపై అంచనా నివేదికలు
తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు.

పనులను వేగవంతం చేయాలని, ప్రతి వారం సమీక్ష
నిర్వహించడం జరుగుతుందని, పురోగతిపై నివేదికలు అందచేయాలని చెప్పారు. ముర్రేడువాగుపై నిర్మిస్తున్న రెండవ
వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల డిఈకి సూచించారు. ప్రజలు ఇబ్బందులు
పడుతున్నారని, ప్రధాన్యతను గమనించి సత్వరమే పూర్తి చేయు విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్
ఉన్న 21 దళితబంధు యూనిట్లుకు నిధులు మంజూరు చేయాలని ఎస్సీ కార్పోరేషన్ ఈడిని ఆదేశించారు. మున్సిపాల్టీలలో
నిర్మించిన వైకుంఠ దామాలకు, రామవరంలో నిర్వహించాల్సిన బయో మైనింగ్కు విద్యుత్ సౌకర్యం కల్పించాలని
విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. 2వ విడత గొర్రెల విడత పంపిణికి ఎంపిక చేసిన లబ్దిదారులు వాటా
చెల్లించు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎంపిక చేసిన లబ్దిదారుల విచారణ ప్రక్రియ, లబ్దిదారుల వివరాలు
ఆన్లైన్ చేయుట పూర్తి చేయాలని చెప్పారు. పశుసంవర్థక అధికారులు యంపడిఓలను, తహసిల్దార్లను సంప్రదించి
లబ్దిదారుల విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఎంపిక చేసిన లబ్దిదారులకు కుల ధృవీకరణ పత్రాలు జారీ
చేయాలని తహసిల్దారులను ఆదేశించారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో వైద్య సేవలను సమీక్షించిన కలెక్టర్ ఆరు వారాల్లో
2635 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. క్యాన్సర్ అనుమానం ఉన్న 9 మందిలో నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించామని, ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. మిగిలిన ఐదుగురికి వైద్య పరీక్షలు నిర్వహించు విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. కంటివెలుగు కారక్రమంలో ఇప్పటి వరకు 338281 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రీడింగ్ కంటి అద్దాలు అవసరమైన 75588 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామని, ప్రిస్కిప్షన్ కంటి అద్దాలు అవసరమైన వారికి 14 వేల కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. 4 వేల కంటి
పంపిణికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 314 గ్రామ పంచాయతీలు, 96 వార్డుల్లో కంటివెలుగు క్యాంపులు
పూర్తి చేసినట్లు చెప్పారు. భద్రాచలం, సారపాకల్లో కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు టీములను ఏర్పాటు
చేయాలని చెప్పారు. కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించుటకు జాబితా సిద్ధం చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking