ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పంపిణీ
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో గ్రామ సర్పంచ్ ముత్యాల సుజాత రవి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు,మార్కెట్ యార్డ్ లో ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ) ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవి కాలంలో మండుతున్న ఎండల నుండి ఉపశమనం పొందడానికి పంపిణీ చేశామన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్,వార్డు సభ్యులు సుర్వి సతీష్,రైతులు ఆవుల నర్సింహ,బోయిని ఆనంద్,ఆవుల శ్రీధర్,కోటమ్మ,చిప్పలపల్లి రవీందర్,సత్తయ్య,మల్లేష్,యాదగిరి,జగన్మోహన్ రెడ్డి అంజయ్య,విఠల్ రెడ్డి, లింగస్వామి ఉపాధి కూలీలు, హమాలీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.