ఎడవల్లి ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్షకు తరలి వెళ్ళిన కాంగ్రెస్ బృందం * టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డికి మద్దతుగా భారీ జన సేకరణ: ఏడవల్లి
ఎడవల్లి ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్షకు తరలి వెళ్ళిన కాంగ్రెస్ బృందం
* టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డికి మద్దతుగా భారీ జన సేకరణ: ఏడవల్లి
భద్రాద్రి కొత్తగూడెం అక్షిత ప్రతినిధి:
కొత్తగూడెం నియోజకవర్గం నుండి టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ అధ్వర్యంలో సోమవారం ఖమ్మం జిల్లాలో టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో జరుగుతున్న నిరుద్యోగ నిరసన దీక్షకు భారీ జన సేకరణతో 100 కార్లు ర్యాలీతో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి కాంగ్రెస్ జెండా ఊపి వెళ్లడం జరిగిందని టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అనేక సమస్యలతో ఇబ్బందులకు గురి అయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిరుద్యోగుల భవిత మారుతుందని భావించిన నిరుద్యోగులకు నిరాశ కరువైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే నిరుద్యోగుల భవిష్యత్ మారుతుందనీ తెలిపారు. కెసిఆర్ మోదీ అవలంబిస్తున్న నిరంకుశ పాలనను ఎండగడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేస్తున్న మహోతర నిరుద్యోగ నిరసన దీక్ష విజయవంతం చేయుటకు ఖమ్మం జిల్లాకు బయల్దేరి వెళ్లినట్లు చెప్పారు. నాయకులు కార్యకర్తలు, అభిమానులు, నిరుద్యోగులు జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్ అనే నినాదాలతో హోరెత్తించి ముందుకు సాగడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య, పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్, చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్, మాజీ యస్సీ సెల్ అధ్యక్షులు, సీనియర్ మాజీ కౌన్సిలర్ గిన్నరపు నాగేందర్, బీసీ సెల్ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మనోహర్, బద్ది కిషోర్, సుబ్బా రెడ్డి, పాంచాల నాగభూషణం, జక్కుల శ్రీనివాస్, దాన్ బాద్ సునీల్, పాల్వంచ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు చాంద్ పాషా, పాల్వంచ పట్టణ యస్సీ సెల్ అధ్యక్షులు పెంకి శ్రీనివాస్, బత్తుల వెంకటేశ్వరరావు, లోగాని మురళి, సారంగా ఫణి, కలిపాక సత్యనారాయణ, రమూర్తి, అక్బర్, రఘు, చంద్రగిరి సత్యనారాయణ, లీగల్ సెల్ నాయకులు అరకల కరుణాకర్, గడ్డిగుట్ట నరేష్, బట్టు గణేష్, భూక్యా శ్రీనివాస్, శనగ లక్ష్మణ్, రెగళ్ల సాయి, కుషాల్, మన్ సింగ్, పెద్దమల్లు నాగేశ్వరావు, గురజాల సీతయ్య తదితరులు పాల్గొన్నారు.