రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది ◆ 18 సంవత్సరాల పైబడిన వారు అందరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి – జడ్పీ చైర్మన్ రోజా శర్మ
రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది
◆ 18 సంవత్సరాల పైబడిన వారు అందరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి
– జడ్పీ చైర్మన్ రోజా శర్మ
చిన్నకోడూరు/సిద్దిపేట అక్షిత ప్రతినిధి :
చిన్నకోడూరు మండల పరిధిలో ని అనంతసాగర్, మల్లారం, సికిందలాపూర్ గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను,అనంత సాగర్ గ్రామంలో కంటి వెలుగు పథకాన్ని,స్టీల్ బ్యాంక్ ను జడ్పీ చైర్మన్ రోజా శర్మ ప్రారంభించా రు.ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ….తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి కేసీఆర్,మంత్రి హరీష్ రావు రైతులకు పెద్ద పీట వేశార ని అన్నారు.రైతులకు ప్రభు త్వం మద్దతు ధర ప్రకటించి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని అన్నారు. రైతుల ఖాతాలో ప్రభుత్వం నేరుగా వడ్ల కొనుగోలు డబ్బులు జమ అవుతాయని తెలిపారు.రై తులు దళారులను నమ్మి మోస పోవద్దని పండించిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచిం చారు.18 సంవత్సరాల పైబడి న వారు అందరూ కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, కంటి వెలుగు పథకం పేద ప్రజ లకు వరం అని అన్నారు.కంటి సమస్యలు ఉన్నవారికి ఉచి తంగా మందులు పంపిణీ చేస్తు న్నట్లు, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్లు నిర్వహిస్తు న్నట్లు తెలిపారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రా లకు ఆదర్శవంతంగా ఉన్నాయ ని అన్నారు .కంటి సమస్యలకు చక్కని పరిష్కార వేదిక కంటి వెలుగు పథకం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన గడపగడ పకు చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి పాపయ్య,రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు వెంకటేశం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి,వైస్ చైర్మన్ కుంటయ్య,సొసైటీ చైర్మన్లు ములకల కనకరాజు, సదానందం గౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, ఎం పి ఓ సోమిరెడ్డి , సర్పంచ్లు చామకుర విజయ లింగం, జ్యోతి ఆంజనేయులు, జయవర్ధన్,ఎంపిటిసి లు గంగా పరుషరామ్,బాలయ్య,వైద్యులు పాల్గొన్నారు .