బిఆర్ఎస్ ప్లీనరీలో ఎమ్మెల్యే నరేందర్ మార్క్
వరంగల్,అక్షిత బ్యూరో : సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న ఓరుగల్లు ప్లీనరీ వేదిక బ్రహ్మాండమైన అలంకరణ,కనువిందుగా కళాకారుల ఆటపాట
-కనివిని ఎరగనిరీతిలో ప్లీనరీ ఏర్పాట్లు
-పసందైన వంటకాలతో రేపటి ప్లీనరికి స్టాల్స్ ఏర్పాటు
-ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కనీవినీ ఎరగని రీతిలో బిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికి వేదిక,లైటింగ్స్,ప్రాంగణంలో టెంట్,బోజనశాల ఇతర పనులు పూర్తికావస్తుండగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారి బృందం ఉదయం నుండి దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి,ఎనమాముల మాజీ మార్కెట్ కమిటీ చేర్మెన్ తుమికి రమేష్ బాబు,గుండేటి నరేందర్,గందే నవీన్ కల్పన,చింతాకుల అనిల్,ముష్కమల్ల అరుణ సుధాకర్,జెడ్ఆర్సిసి మెంబెర్ సునీల్,కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్,మాజీ కార్పొరేటర్ సంజయ్ బాబు,బిఆర్ఎస్ నాయకులు దుబ్బ శ్రీనివాస్,ఆర్టీఏ మెంబర్ గోరంటాల మనోహర్,మెడిద మధు ఇతర ముఖ్య నాయకులు ఎమ్మెల్యేతో పాటు ఏర్పాట్లను పరిశీలించారు..