శ్రీ రామ్ బాలయ్య కుటుంబానికి కాంగ్రెస్ నేతల ఆర్థిక సహాయం
చేర్యాల,ఏప్రిల్ 24 అక్షిత ప్రతినిధి: చేర్యాల పట్టణ కేంద్రంలోని ఐకెపి మహిళా విభాగంలో సిఏ గా పనిచేసిన శ్రీ రామ్ బాలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందినందున, సోమవారం కాంగ్రెస్ నేతల సహాయంతో బాలయ్య కుటుంబానికి 25 కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులను ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎండి ఎగ్బాల్, మున్సిపల్ కౌన్సిలర్ ముత్యాల తారా యాదగిరి, నాయకులు బొడిగె రమేష్,కాటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.