గ్రామ గ్రామాన ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలి
చౌటుప్పల్, అక్షిత ప్రతినిధి:
చౌటుప్పల్ భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు గిర్కంటి నిరంజన్ గౌడ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశానుసారం భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఏప్రిల్ 25న గ్రామ గ్రామాన ఉదయం 9 గంటలకు బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి 10 గంటలకు మునుగోడులో ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి ప్రజా ప్రతినిధుల సమావేశానికి హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభం చేయనున్నారని తెలియజేశారు. నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, మండల అధ్యక్షులు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు మహిళా నాయకులు, రైతుబంధు కన్వీనర్లు, సర్పంచులు,ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు మన పార్టీ రంగు పింక్ రంగు వస్త్రధారణతో పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు చిన్నం బాలరాజు, దొడ్డి లింగస్వామి, యాట కృష్ణ, తగరం వెంకటేశం, పిట్టల శంకరయ్య, నీల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.