పోలీసులపై షర్మిల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం -తెలంగాణ రక్షణ సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ

పోలీసులపై షర్మిల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

-తెలంగాణ రక్షణ సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

తెలంగాణ పోలీసులపై షర్మిల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రక్షణ సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ అన్నారు.నిన్న మీడీయా తో మాట్లాడుతూ రాజకీయాలలో ఓర్పు సహనం అవసరం ఆవేశాన్ని కోపాన్ని అదుపులో పెట్టుకోవడమే రాజకీయ నాయకుల ముఖ్య లక్షణమన్నారు.మా తెలంగాణ పోలీసులను కొట్టడం దురుసుగా ప్రవర్తించడం దేనికి నిదర్శనం? అన్ని రాజకీయ పార్టీలు ఖండించవలసిన అవసరం ఉందన్నారు.చట్టం తన పని తాను చేసుకు పోతుంది చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన దీక్షలు ఎవరైనా చేయవచ్చు. ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు కానీ మనం వెళ్లే పని చట్ట పరిధిలో ఉన్నప్పుడు ముందుగా పర్మిషన్ తీసుకుని చేయాలే తప్ప ఆవేశంతో కూడిన పనులు అనర్థాలను తీసుకొస్తాయని హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking