26న మిర్యాలగూడలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పర్యటన
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఈనెల 26న మిర్యాలగూడ నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యటించనున్నారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి విస్తరణలో భాగంగా వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి ఇరువురు మంత్రులతో కలిసి శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ నేపథ్యంలో శంకుస్థాపన చేయనున్న ప్రదేశాన్ని స్థానిక నేతలతో కలిసి భాస్కర్ రావు సోమవారం పరిశీలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి తదితరులు పాల్గొన్నారు.