అభాగ్యులకు ఆర్థిక భరోసా
* ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం
* ఆపద్బాంధవుడు ‘కేసీఆర్’
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్ ) నిరుపేదలకు వరమని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కొనియాడారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవ్యాప్తంగా 47 మంది
బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.23 లక్షల 97 వేలు విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. సీఎం అందజేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధికారి బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీలు నూకల సరళ హన్మంత్ రెడ్డి, పోకల శ్రీవిద్య రాజు, డీసీఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మైనారిటీ నాయకులు యూసుఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బంటు శ్రీనివాస్, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, పాక్స్ చైర్మన్లు వెలిశెట్టి రామకృష్ణ, జెర్రిపోతుల రాములు గౌడ్, చిర్ర మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇంఛార్జీలు,ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.