నాణ్యమైన ధాన్యం తెచ్చి
మద్దతు పొందండి
*ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అదనపు కలెక్టర్*
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
వానాకాలం సీజన్ కు సంబందించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్(రెవెన్యూ) జె.శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు .నల్గొండ మండలంలో అర్జాల బావి గ్రామం, పి.ఏ.సి.ఎస్ కేంద్రాన్ని, చిన్న సూరారం గ్రామంలో ఐ.కె.పి కేంద్రాన్ని, కట్టంగూరు మండలంలో అయిటి పాముల గ్రామంలో ఐ.కె.పి కొనుగోలు కేంద్రాన్ని, కట్టంగూరులో పి. ఏ.సి.ఎస్, కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో వానాకాలం సీజన్ సంబంధించి వరి కొనుగోలు కేంద్రాలకు 6 లక్షల 75 వేల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. జిల్లాలో 213 వరి ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అందులో పి. ఏ.సి ఎస్ ద్వారా 116, ఐ.కె.పి ద్వారా 91, రైతు ఉత్పత్తి సంస్థల 6 ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నాగేశ్వరరావు, డిఆర్డిఓ కాలిందిని, డి. సి. ఓ కిరణ్ కుమార్,జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.