సి విజిల్ ఆప్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
కలెక్టర్ ఆర్ వి కర్ణన్
మునుగోడు, అక్షిత ప్రతినిధి :
సి.విజిల్ ఆప్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ మును గోడ్ తహశీల్దార్ కార్యాలయం ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.సి.విజిల్ యాప్ పై అవగాహన కలిగించాలని, అందుకు సంబంధించిన ప్లెక్సీ కార్యాలయం ముందు ఏర్పాటు చేయాలని అన్నారు.బి.ఎల్. ఓ లతో మాట్లాడుతూ సి.విజిల్ ఆప్ గురించి అడిగారు.ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు,డబ్బు ,మద్యం పంపిణీ,వస్తువులు పంపిణీ పై ఫోటో,వీడియో ద్వారా పిర్యాదు చేస్తే 100 ని.లలో పరిష్కరించటం జరుగుతుందని అన్నారు.
ఓటర్ జాబితా లో డుప్లికేట్ లు,మరణించిన వారి తొలగింపు చేశారా అడిగి తెలుసుకున్నారు పి. డబ్ల్యూడి ఓటర్ లు మార్కింగ్ చేయాలని అన్నారు.80 సం.లు దాటిన వారు,ఇంటి నుండి కదల లేని స్థితి వారు హోం ఓటింగ్ అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.వారికి సంబంధిత దర ఖాస్తు అందగా చేసి కలెక్ట్ చేయాలని అన్నారు.కలెక్టర్ వెంట అర్.డి. ఓ దామోదర రావు,తహశీల్దార్ ఉన్నారు.