ఇది మన పార్కు… కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ*

ఇది మన పార్కు.. కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ*

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, అక్షిత ప్రతినిధి :

మార్నింగ్ వాక్ లో భాగంగా గురువారం ఎల్ బి నగర్ శాసనసభ్యులు, భారాస పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని హరిణ వనస్థలి నందు పలువురు వాకర్స్ సభ్యులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వాకర్స్ మాట్లాడుతూ మా యొక్క మద్దతు ఎప్పుడు ఉంటుంది అని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న యోగ షెడ్డు వెడల్పు చేయాలని, ఓపెన్ జిమ్స్ ఎర్పాటు చేయాలని కోరారు. దానికి గాను సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇట్టి వాకింగ్ ట్రాక్ నందు మీకు యోగ కోసం షెడ్డు మేమే వేయించడం జరిగింది అని తెలిపారు. అయిన కూడా అదనపు షెడ్డు నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది అని హామీ ఇచ్చారు.

అలాగే ఓపెన్ జిమ్స్ కూడా ఎర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ఇట్టి పార్క్ నందు కొన్ని స్థలాలు తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు దళారులు అమ్ముకోవడం జరిగింది .కావున వారిపై కొంత జాగ్రత్తగా ఉండాలని, కొని మోసపోవొద్దు అని తెలిపారు .ఇది మన పార్క్ దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉందని గుర్తు చేశారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కారం చేస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని కొన్ని చెరువులు కూడా పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎస్.టీ.పీ. ప్లాంట్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది అని తెలిపారు. అలాగే ఆనంద్ నగర్ చౌరస్తా వద్ద ఒక నూతన ఫ్లై ఓవర్ నిర్మిస్తే ట్రాఫిక్ నుంచి పూర్తి స్థాయిలో విముక్తి లభిస్తుంది అని తెలిపారు. కావున నన్ను మరొక్కసారి ఆశీర్వదించి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని సుధీర్ రెడ్డి కోరారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు జగదీష్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి ,అశోక్ యాదవ్, భాస్కర్ యాదవ్, రాకేశ్ మరియు వాకర్స్ సభ్యులు విక్రమ్ రెడ్డి, విద్యాసాగర్ రావు, ఉపేందర్ రావ్, కృష్ణ గౌడ్, బిక్షపతి యాదవ్, మహేందర్ రెడ్డి, నరేందర్ గుప్తా, మల్లేష్, గోపి నాయక్, జగన్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking