కుట్టుమిషన్ లు పంపిణి

కుట్టుమిషన్ లు పంపిణి

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

రామన్నపేట పట్టణ కేంద్రంలోని హంస ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలో శిక్షణ పొందిన సూరారం గ్రామానికి చెందిన కందుల లక్ష్మి, పల్లివాడ గ్రామానికి చెందిన దండిగ శోభలకు తెలంగాణ ఉద్యమ ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె చాంద్ శిక్షణ పొందిన మహిళలకు తన వంతు సహాయంగా ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు.బీద మహిళలకు ఆర్థిక సహాయం చేయుటకు దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. మాట్లాడుతూ ఆర్థికంగా ఎదగాలని పనితనం మెరుగుపరచాలని మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుల నరసింహ ,దండిగ నరసింహ ,మణి, హేమంత్ ,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking