ఎమ్మెల్యే బరిలో నెక్కొండ.. గటిక బ్రదర్స్

ఎమ్మెల్యే బరిలో నెక్కొండ.. గటిక బ్రదర్స్

విజయ్ – అజయ్

ముఖ్యమంత్రి మాజీ పిఆర్ఓ, ఎంపీపీ

నెక్కొండ, అక్షిత న్యూస్ :

నెక్కొండ ముద్దుబిడ్డలు ప్రజా నాయకులు అధికారంలో ఉన్నా, లేకున్నా నిత్యం ప్రజల కొరకు పోరాడే కుటుంబం.ప్రజాసేవకే అంకితం వారి కుటుంబం.. నాన్న టీచర్ గా హెడ్మాస్టర్ గా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి, ప్రస్తుతం రిటైర్డ్ గా ఉన్నారు. వివిధ సంఘాల నాయకులుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజలను చైతన్యవంతులుగా మారుస్తూ, మంచి నాయకుడిగా ముందుకు పోతున్న వ్యక్తి గటిక మల్లయ్య , ఆయన సతీమణి ఘటిక సుగుణమ్మ ప్రజాసేవలో తనను మించిన నాయకురాలుగా ఇంతవరకు చూడలేదు అన్నట్టుగా మండల ప్రజలు ఇప్పటివరకు చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో జడ్పిటిసిగా గెలిచి ప్రజలకు సేవలు అందించిన సుగుణమ్మ, ఆమె మరణానంతరం వారి పెద్ద కొడుకు అజయ్ బాద్యతలు చేపట్టాడు. తెలంగాణ ఉద్యమాలలో పాల్గొని, తెలంగాణ ప్రకటన అనంతరం టిఆర్ఎస్ పార్టీలో చేరి నెక్కొండ ఎంపీపీగా గెలిచి కులమత బేధాలు లేకుండా చిన్న పెద్ద తేడా చూడకుండా ప్రజలు అభిమానించే నాయకుడిగా,ప్రజల గుండెల్లో నిలిచిపోయే నాయకుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు, ప్రజలకు సేవలు అందించి, తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ, ట్రిబ్యునల్ మెంబర్ గా నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకున్న గటిక అజయ్ కుమార్.

విజయ్ కుమార్ 10 తరగతి వరకు నెక్కొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పిహెచ్డి తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ ఎంసీజే పూర్తి చేశారు. విజయ్ కుమార్ రాష్ట్రస్థాయిలో జర్నలిస్టుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఏనలేని కృషి చేస్తూ జలదీక్ష, ఉజ్వల ప్రస్థానం అనే బుక్కును రిలీజ్ చేసి రాష్ట్ర యువతను మేల్కొల్పే విధంగా ఆయన ప్రస్తావనను మొదలుపెట్టారు. అనునిత్యం పేదల కొరకు కలం పట్టి పత్రికా రంగం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ విద్యార్థి దశ నుండి ప్రజల పక్షాన పనిచేస్తూ ఏబీఎన్ న్యూస్ రిపోర్టర్ ,న్యూస్ రిపోర్టర్ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై ఉద్యమాలు చేసి జర్నలిస్టుల సంఘాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నితుడుగా ఉంటూ సీఎం పిఆర్ఓగా ఏడు సంవత్సరాలు పని చేశారు…గటిక విజయ్ కుమార్. ప్రజల సమస్యపై ప్రశ్నించే నాయకుడిగా, సమర్థమంతమైన నాయకుడిగా అనుభవం ఉంది. కాబట్టి వీరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఆలోచనలు బిజెపి అధిష్టానంకు ఉందని తెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పరిపాలించిన రేవూరి ప్రకాష్ రెడ్డి రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే టికెట్ బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. నర్సంపేట ఎమ్మెల్యే బరిలో ముందుకు పోతున్న రేవూరి ప్రకాష్ రెడ్డి…ఒక్కసారిగా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందడంతో ఇటు బీజేపీ శ్రేణుల్లో అటు రాజకీయవర్గాల్లో కొంత ఆసక్తికరంగా మారింది.పార్టీ మారుతున్నారనే ఊహగానాలు మొదలయ్యాయి..


రేవూరి కాంగ్రెస్ పార్టీలోకి వెళితే నర్సంపేట నియోజకవర్గం బిజెపి పార్టీ నుండి ఎమ్మెల్యే బరిలో గటిక బ్రదర్స్ ని నియమిస్తారని పలు రాజకీయ నేతల ఆలోచన..దీంతో పార్టీ కార్యకర్తల్లో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి.నర్సంపేట నియోజకవర్గం బిజెపి పార్టీ తరఫున సరైన నాయకులు గటిక బ్రదర్స్ ఉన్నారని బిజెపి పార్టీ నాయకుల ఆలోచన వారికే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని వారి అనుచరుల వర్గం అనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking