బీజేపీపై యుద్దానికి సిద్దమైన మాదిగలు

బీజేపీపై యుద్దానికి సిద్దమైన మాదిగలు

-మాదిగలను మోసం చేస్తున్న బిజెపి కి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తాం

-వంగపల్లి శ్రీనివాస్ మాదిగ

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని మాయమాటలు చెప్పి మాదిగలను మోసం చేస్తూ వస్తున్నటువంటి బిజెపి పార్టీ మోసాన్ని మాదిగలు ఎండగట్టి ఓటు ద్వారా బీజేపీ పైన మరో యుద్దానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మాదిగ జాతికి పిలుపునిచ్చారు.నేడు ఖమ్మం జిల్లా కేంద్రం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ దాదాపు దశాబ్ద కాలంగా వర్గీకరణ పేరుతో మాదిగలను మోసం చేస్తున్నటువంటి బిజెపి పార్టీకి రేపు రాబోయే ఎన్నికలలో ఓటు ద్వారానే మాదిగలంతా ఏకమై తగిన బుద్ధి చెబుతారని వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. కేవలం మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నటువంటి బిజెపి పార్టీ దేశంలో ఎంతో క్రిష్టతరమైనటువంటి సమస్యలను వారికి వారి పార్టీ విధానాలకు అనుగుణంగా మార్చుకుంటూ వర్గీకరణలో ఎందుకు జాప్యం జరుగుతుందో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.మనువాద బ్రాహ్మణీయ సిద్ధాంతాలతో అణగారిన వర్గాలను అట్టడుగు స్థాయికి నెట్టవేస్తున్నటువంటి బిజెపి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు అనే ఆయుధంతోనే తిప్పుకొట్టడానికి మాదిగలు సంసిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.ఇప్పటికైనా బిజెపి పార్టీ దళిత అనగారిన వర్గాల వ్యతిరేక పార్టీ అని మనువాదానికి మాదిగవాదమే ప్రతివాదంగా రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణగా ప్రకటించి మరో పోరాటానికి సిద్ధమవుతామని వారు తెలిపారు అందులో భాగంగానే మాదిగల భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నామని రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెపుతమని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో
రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ల మధు జాతీయ ఉపాధ్యక్షులు లంక వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి పడిశాల వెంకన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పీర్ల శ్యామ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హెచ్ వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు మోదుగు రాజు బోనకల్ మండల అధ్యక్షులు మోదుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking