నూతన త్రిపుర రాష్ట్ర గవర్నర్ ను కలిసిన బూరుగు సురేష్ గౌడ్
చేర్యాల,అక్టోబర్ 19 అక్షిత ప్రతినిధి: బిజెపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు,బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి ఇటీవల త్రిపుర రాష్ట్ర గవర్నర్గా నియమితులై నందున, గురువారం బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ జనగామ నియోజకవర్గం హైదరాబాదులో నల్లు ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి హర్ధిక శుభాకాంక్షలు తెలిపినారు. అనంతరం ఇంద్రసేనారెడ్డి తో సురేష్ గౌడ్ మాట్లాడుతూ నేను సుమారు 15 సంవత్సరాల నుండి బిజెపి పార్టీలో ఉంటూ విద్యార్థి సంఘం ఏబీవీపీ పార్టీ నాయకునిగా కష్టపడి పని చేస్తూ అంచలంచలుగా ఎదుగుతూ నియోజకవర్గంలో ప్రజలతో ఏకమై ఉంటూ ప్రస్తుతం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నానని, కావున రేపు జరగబోయే ఎలక్షన్లో బిజెపి జనగామ అసెంబ్లీ టికెట్ ను తనకే ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.