స్థానికున్ని గెలిపించుకుందాం

స్థానికున్ని గెలిపించుకుందాం
స్థానికేతరుడిని తరిమికొడదాం

మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

మద్దూరు అక్షిత న్యూస్ :

మద్దూరు , దూలిమిట్ట జడ్ పిటిసి గిరి కొండల్ రెడ్డి, మండల పార్టీ అద్యక్షులు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం మద్దూరు,దూలిమిట్ట కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం మండల కేంద్రములోని తాజ్ మహల్ గార్డెన్ లో ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి విస్తతంగా తీసుకొని పోవాలి అని తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలని ఆంధ్రుడు అని సంబోధించిన కేసీఆర్ ఇప్పుడు పల్ల రాజేశ్వర్ రెడ్డి కూడా మనకు ఆంధ్రుడు కిందనే లెక్క అని తెలిపారు. స్థానికున్ని గెలిపించి స్థానికేతురుని మన ప్రాంతం నుంచి తలిమి కొట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఏ ఆకాంక్షతో అయితే నీళ్ల కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం పోరాటం చేసినామో ఇప్పుడు అదే కేసీఆర్ మన జనగామ ప్రాంతానికి సంబంధించిన నీళ్లను పక్క జిల్లాలకు దోచుకొని పోతుండు తెలిపారు.
అప్పుడు ఆంధ్రవాళ్ల దోస్కూరు ఇప్పుడు మన నీళ్లను పక్క జిల్లా వాళ్ళ దూసుకుపోతున్నారని తెలిపారు.జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని దానికోసం ప్రతిఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుల వలే పనిచేయాలని తెలిపారు.
బి.ఆర్.ఎస్ పార్టీ కల్లబొల్లి మాటలుతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుందని కె.సి.ఆర్ గారి గారడి మాటలు ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.
ఈ45 రోజులు మనకు చాలా కీలకం అని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల వలే పనిచేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ఆయా గ్రామాల వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి సాదరంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా మహిళా అద్యక్షులు ఇంద్రా,కౌన్సిలర్ వంగాల కల్యాణి, అబ్జార్వర్ శారదా,సర్పంచ్ బాల్ రాజ్ యాదవ్, ఎంపీటీసీ నంకు, మాజీ సర్పంచులు, మద్దూరు, దూలిమిట్ట మండలాల ఇంఛార్జి జీవన్ రెడ్డి, రాగుల శ్రీనివాస్ రెడ్డి, కనకచంద్రం,గుడ్డం బద్రి, బాల్ రాజ్, ఆయా గ్రామాల అధ్యక్ష,కార్యదర్శులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking