ఖమ్మంలో తుమ్మలకు పెరుగుతున్న మద్దతు

ఖమ్మంలో తుమ్మలకు పెరుగుతున్న మద్దతు

-ప్రముఖులను కలిసి మద్దతు కూడగడుతున్న తుమ్మల

-వివిధ పార్టీల నాయకులు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

మీ ఆదరాభిమానాలు చూస్తుంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.ఖమ్మం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు.ఖమ్మం పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని వారి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకై మద్దతు కోరారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ ప్రముఖ సీనియర్ వైద్య నిపుణులు బోడెపూడి శైలజ అజయ్ కుమార్ బిలీఫ్ హాస్పిటల్ డాక్టర్ రమాదేవి డాక్టర్ బాబురావు మాజీ కౌన్సిలర్ నిర్మల మచ్చ లక్ష్మి బీసీ సంఘం సీనియర్ నాయకులు మేకల బిక్షమయ్య ప్రముఖ ఆడిటర్ వ్యాపారవేత్త ఈశ్వరప్రగడ హరిబాబు. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కేవి కృష్ణారావు ఇంటిదగ్గర పలు వివిధ పార్టీల నాయకులతో పాటు పాత తరపు తెలంగాణ ఉద్యమ నాయకుడు విద్యాసాగర్ ని బిసి నాయకులు వీరభద్రం ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు ప్రేమ్ చంద్ర నాయక్ రాంబాబు నాయక్ ఏర్పాటుచేసిన సమావేశం లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చినందుకు ఈసారి మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలో తీసుకురావాలని కోరినారు. త్రీ టౌన్ ప్రాంతంలోని చెందిన సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతోపాటు నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాలలో మాజీ కార్పొరేటర్ తిలక్ ఉన్నారు.ఖమ్మం పట్టణ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు సమీనా ఖయ్యూం ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకై వారి మద్దతు కోరారు.కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పట్టణ మాజీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో సాధు రమేష్ రెడ్డి తదితురులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking