బీ ఫాం ఓకే.. ఇక హ్యాట్రిక్

బీ ఫాం ఓకే.. ఇక హ్యాట్రిక్

సీఎం కేసీఆర్ నుండి బీ-ఫామ్ అందుకున్న మిర్యాలగూడ
ఎంఎల్ ఏ భాస్కర్ రావు

అభివృద్ధి, సంక్షేమమే గీటురాయి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

సీఎం కేసిఆర్ నుంచి మిర్యాలగూడ ఎంఎల్ ఏ భాస్కర్ రావు మంచి ముహూర్తం చూసుకుని బీ ఫాం అందుకుండ్రు.. ఇక భారీ మెజార్టీతో హ్యాట్రిక్ కొట్టుడే.మిర్యాలగూడ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న భాస్కర్ రావును భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సంసిద్దులయ్యారు. అందుకు గులాబీ శ్రేణులు ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు. మిర్యాలగూడను అన్ని రంగాల్లో అభివృధ్ది చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. చేసిన అభివృధ్ది, సంక్షేమం భారీ విజయానికి గీటు రాయిగా నిలువనుంది. ఇప్పటికే ప్రచార పర్వంలో మునిగిపోయిన భాస్కర్ రావుకు ప్రజల నుంచి జన నీరాజనం పలుకుతుండ్రు. గులాబీ దళపతి, సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్, జగదీష్ రెడ్డిలతో ఉన్న సత్సంబంధాలు మిర్యాలగూడ ప్రగతికి సోపానాలు నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతానని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధ్యక్షుడు, సిఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆయన బీ-ఫామ్, రూ.40 లక్షల చెక్కు అందుకున్నారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. గత తొమ్మిది సంవత్సరాల్లో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరాటంకంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ కు మరోసారి పట్టం కడతాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులంతా సమిష్టి కృషి చేయాలని కోరారు. కనీసం 50వేల మెజారిటీ తగ్గకుండా విజయం నమోదు చేస్తామని అన్నారు. ప్రచార యాత్రలో ఏ ఊరికి వెళ్ళినా ప్రజలు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గులాబీ జెండా రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్ర ప్రగతి రథ చక్రాలు ఆగిపోవద్దనుకుంటే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కు ఓటు నమోదు చేయాలని భాస్కర్ రావు కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లైతే మళ్లీ చీకటి రోజులు అలుముకొని రాష్ట్రం అంధకారంలోకి కూరుకుపోతుందన్నారు. క్యాడర్ లేని బీజీపీ నేతలు రాష్ట్రంలో ద్వితీయ స్థానం కోసం కాంగ్రెస్ తో పోటీపడుతున్నదని విమర్శించారు. నాయకత్వ లోపంతో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులపై అభ్యర్థులను నిలబెట్టాలంటే దొరకక నానా హైరనాపడి పోతున్నారని విమర్శించారు. సిఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాజకీయ వ్యూహాలను అర్థం చేసుకోలేక కాంగ్రెస్, బీజీపీ నేతలు మేకపోతు గంభిర్యాలను ప్రదర్శిస్తున్నారని, ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు దేశానికే బువ్వపెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. వ్యవసాయానికి 3 గంటలు చాలనే కాంగ్రెస్ కు లేక 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టిన కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కు ఓటెయ్యాలనేది ఓటర్లు నిర్ణయించుకోవాలన్నారు. ఆసరా పెన్షన్లు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, దళిత బంధు ఇతర రాష్ట్రాల నేతలను సైతం ప్రభావితం చేశాయన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని భాస్కర్ రావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking